కామారెడ్డి, ఆగష్టు 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక రక్షా బంధన్ అని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. దేశ సంస్కృతి, జీవన తాత్వికతకు రాఖీ పండుగ వేదికని, ఏటా శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి ని రాఖీ పండుగగా జరుపుకుంటామని అన్నారు. గురువారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో బాలసదనంకు చెందిన పిల్లలు జిల్లా కలెక్టర్‌కు రాఖీలు కట్టగా వారిని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ చాకలేట్స్‌తో కూడిన టిఫిన్ బాక్స్‌లను అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ సోదరులకు రాఖీ కట్టడం ద్వారా తమకు రక్షణగా నిలుస్తారని సోదరీమణులు ఆకాంక్షిస్తారని అన్నారు. అంతే గాక మానవ సంబంధాలు, కుటుంబ అనుబంధాలు మరింత బలపడుతాయని రక్త సంబంధాల్లోని ఔన్నత్యం దిగ్విణీకృతం అవుతుందని అన్నారు. అనంతరం పిల్లలతో కలిసి కలెక్టర్ సెల్ఫీ ఫోటో దిగారు.
అదనపు రెవిన్యూ కలెక్టర్ చంద్ర మోహన్‌కు కూడా బాలసదనం విద్యార్థినిలు రాఖీలు కట్టారు. అంతకుముందు బ్రహ్మకుమారీస్ రాజయోగిని బి కె జయ, బ్రహ్మకుమారీస్ గంగ, కవిత, అనిల్, సునీత, మాతాజీలు కలెక్టర్‌కు రాఖీలు కట్టి తమ ఆత్మీయతను చాటారు. కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమాధికారి రమ్య, డిసిపిఓ స్రవంతి, బాలసదానం సూపరింటెండెంట్ సంగమేశ్వరి, బ్రహ్మకుమారీస్ పాల్గొన్నారు.