నిజామాబాద్, సెప్టెంబర్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏఎన్‌ఎంల 17వ రోజు సమ్మెలో భాగంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శుక్రవారం నిజామాబాద్ కొత్త కలెక్టర్ ఆఫీస్ ఆవరణలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య, యూనియన్ జిల్లా అధ్యక్షురాలు భారతమ్మ మాట్లాడుతూ 17 రోజులుగా సమ్మె చేస్తా ఉంటే ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు.
ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో జ్వరాల బారిన పడినిటువంటి ప్రజలు చిన్నపిల్లలు గర్భవతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారి ఆరోగ్యం గురించి ఆలోచించైనా తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కానీ అధికారులు షోకాస్ నోటీసుల ద్వారా ఉద్యోగాల నుండి తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని వారి బెదిరింపులకు ఏఎన్‌ఎంలు భయపడరని అర్థం చేసుకోవాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం భేషజాలకు పోకుండా ఏఎన్‌ఎంలను రెగ్యులర్ చేయడంతో పాటు ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసుకోవాలని లేని ఎడల సమ్మె మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు కళావతి, భాగ్యలక్ష్మి, సుజాత, విట్టా బాయి, సరస్వతి, శశికళ, వనజ, ఏఎన్‌ఎంలు తదితరులు పాల్గొన్నారు.