కామారెడ్డి, సెప్టెంబర్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆదేశాల మేరకు టిపిసిసి ఎస్సి విభాగం రాష్ట్ర అధ్యక్షులు ప్రీతమ్ అన్న ఆదేశాల మేరకు డిసిసి అధ్యక్షులు కైలాస్ శీనన్న ఆధ్వర్యంలో శుక్రవారం ఎస్సీ విభాగం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మద్దెల భాగయ్య, ఆర్ బాగయ్యకి ఎస్సీ విభాగం జిల్లా ఉపాధ్యక్షులుగా నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని గెలిపించే దిశగా అనునిత్యం కష్టపడుతూ ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీ విధానాలను తీసుకెళ్తూ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్లాలని టిఆర్ఎస్ పార్టీని ఓటు అనే ఆయుధంతో కామారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్కు సమాధి కడదామని మాజీ మంత్రివర్యులు ప్రజా నాయకుడు కామారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యేగా షబ్బీర్ అలీని భారీ మెజారిటీతో గెలిపించే విధంగా కష్టపడాలని అన్నారు.
ఈ సందర్భంగా ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షులు మద్దెల భాగయ్య మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో దళితవాడలో ముమ్మరంగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ తీసుకెళ్లి కెసిఆర్ దళితులకు చేసిన మోసాలను గుర్తు చేసి ప్రజలను చైతన్యవంతం చేస్తూ కాంగ్రెస్ పార్టీని గెలిపించే దిశగా కష్టపడాలని సూచించారు.