కామారెడ్డి, సెప్టెంబర్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం జంగంపల్లి శివారులోని రాఘవ లైఫ్ సైన్సెస్ ఫార్మా కంపెనీ ఎదుట దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. జంగంపల్లి గ్రామానికి చెందిన వార్డ్ సభ్యుడు శివరాజు కత్తితో ఆత్మహత్యకు పాల్పడగా అతని భార్య జ్యోతి ఒంటిపై పెట్రోలు పోసుకోని ఆత్మహత్యయత్నానికి పాల్పడిరది.
కంపెనీ సెక్యూరిటీ మరియు పోలీస్ సిబ్బంది అడ్డుకొని జ్యోతిని అంబులెన్స్‌లో కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా శివరాజును పోలిసులు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
కంపెనీలోని ఉద్యోగులను తరలించేందుకు మూడు బస్సులను కొనుగోలు చేశానని, కంపెనీ వారు డబ్బులు సమయానికి చెల్లించలేక 70 లక్షలు నష్టపోయానని బాధితులు ఆరోపించారు. 70 లక్షల రుపాయల అప్పు అయిందని, మనస్థాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు వారు తెలిపారు.