బాన్సువాడ, సెప్టెంబర్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో మెగా డీఎస్సీ కోసం ఎన్ఎస్యుఐ ఒకరోజు నిరసన దీక్షలో భాగంగా శనివారం నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా నియోజకవర్గ అధ్యక్షుడు భాను ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం మెగా డీఎస్సీని తక్షణమే ప్రకటించాలని ప్రమోషన్ల ఖాళీలను మెగా డీఎస్సీలో చూపించాలని, ప్రభుత్వ విద్యా వ్యవస్థను ప్రవేటుకు దీటుగా బలోపేతం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అర్పత్, నగేష్, దత్తు తదితరులు పాల్గొన్నారు.