కామారెడ్డి, సెప్టెంబర్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పిట్లం వ్యవసాయ మార్కెట్ యార్డు నందు నూతనంగా నిర్మించిన 20 దుకాణ సముదాయాలను అద్దె ప్రాతిపదికన ఆన్లైన్ ద్వారా బహిరంగ వేలం నిర్వహించనున్నామని జిల్లా మార్కెటింగ్ అధికారి రమ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కాగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇందులో ఎస్సిలకు 3, ఎస్టీకి ఒకటి, బి.సికి 5, పిహెచ్సికి ఒక దుకాణం, జనరల్ క్యాటగిరి క్రింద ఇతరులకు 10 దుకాణాలు కేటాయించబడినవని ఆమె తెలిపారు.
వేలంలో పాల్గొనదలచిన ఆసక్తి గల అభ్యర్హులు పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయపు పనివేళలలో 500 రూపాయలు చెల్లించి దరఖాస్తు పొందాలని సూచించారు. దరఖాస్తు వెంట కార్యదర్శి, వ్యవసాయ మార్కెట్ కమిటీ, పిట్లం పేర 15,000 రూపాయల డి.డి. ని ఏదైనా జాతీయ బ్యాంక్ నుండి తీసి, స్వంత చిరునామా గల ఏదేని ఆధార్/రేషన్/ఓటర్ కార్డును జతచేసి ఈ నెల 11 న సాయంత్రం 5 గంటలలోగా అదే కార్యాలయంలో అందజేయవలసినదిగా ఆమె సూచించారు.
వివరాలకు కార్యదర్శి మొబైల్ నెంబర్ 7330733249 ను సంప్రదించవలసినదిగా ఆమె సూచించారు