కామారెడ్డి, సెప్టెంబర్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎస్సీ ,ఎస్టీ ,ఉపాధ్యాయ సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా బిక్కనూరు యాదయ్య. కామారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ సంఘం భవనంలో కామారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షునిగా బిక్కనూర్ యాదయ్యను ఏకగ్రీవంగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఎస్సీ ఎస్టీ ,ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పెంట అంజయ్య, నూతనంగా ఎన్నికైన అధ్యక్షున్ని అభినందిస్తూ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయుల సమస్యలపై స్పందిస్తూ వారికి సేవ చేయాలని సూచించారు. జిల్లాలో జరగబోయే పదోన్నతులు మరియు బదిలీలను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను కోరారు.
జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సంఘం బలోపితానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో నూతన అధ్యక్షులు బిక్కనూర్ యాదయ్య, జనరల్ సెక్రెటరీ అయ్యల సంతోష్, జిల్లాలోని సీనియర్ నాయకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దానయ్య జిల్లా నాయకులు పాల్గొన్నారు.