కామారెడ్డి, సెప్టెంబర్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నిజాంసాగర్ ప్రాజెక్ట్ నాలుగు గేట్లు ఎత్తి 20 వేల క్యూసెక్కుల నీటిని క్రిందికి వదిలామని, నదీపరివాహక ప్రాంత గ్రామస్తులు అప్రమత్తంగా ఉండవలసినదిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సోమవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
అత్యవసరమైతే తప్ప రాత్రిపూట చీకట్లో ఎవ్వరు బయట తిరగరాదని అన్నారు. నది దిగువ పరివాహక ప్రాంతం సమీపంలో ఉన్న పశువులను ఎత్తు ప్రదేశాలకు తరలించాలన్నారు. అదేవిధంగా నది పరివాహక లోతట్టు ప్రాంతాలకు చేపలు పట్టే వారు, పశువుల కాపరులు, రైతులు, ప్రజలు ఎవ్వరు వెళ్లవద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.