బాల్కొండ, సెప్టెంబర్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువ పరివాహక ప్రాంతాలలో కురుస్తున్న వర్షం కారణంగా, ఏ సమయంలోనైనా ప్రాజెక్ట్ వరద గేట్లు ఎత్తి, వరద నీరు గోదావరి నదిలోకి వదిలే అవకాశం ఉన్నట్టు శ్రీరాం సాగర్ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఒక ప్రకటనలో తెలిపారు.
గోదావరి నదీ దిగువ పరివాహక ప్రాంతంలోకి పశువులు, చేపలు పట్టేవారు, పశువుల కాపరులు మరియు రైతులు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ దిగువ పరివాహక ప్రాంతాల గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయవలసిందిగా పోలీస్, రెవెన్యూ అధికారులకు మరియు ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు.