నెలాఖరులోగా రుణమాఫీ డబ్బులు అందేలా చూడాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అర్హత రైతులందరికి ఈ నెలాఖరులోగా రుణమాపీ డబ్బులు అందేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. అన్నదాతకు ఆర్ధిక వెసులుబాటు కల్పించేందుకు ప్రభుత్వం రూ. లక్ష లోపు పంట రుణాల మాఫీ చేస్తోందని, రుణమాఫీ వర్తింపజేసిన రైతులకు సైతం తిరిగి కొత్తగా పంట రుణాలను మంజూరు చేయాలని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి టి.హరీశ్‌ రావు సూచించారు.

సోమవారం దేవాదాయ శాఖ మంత్రి ఏ.ఇంద్రకరణ్‌ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి ఇతర ఉన్నతాధికారులతో కలిసి మంత్రి హరీశ్‌ రావు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 42 లక్షల మంది రైతులకు ప్రభుత్వం రుణమాఫీ వర్తింపజేస్తూ లబ్ది చేకూర్చనుందని తెలిపారు.

ప్రభుత్వం ఇప్పటికే 18.79 లక్షల మంది రైతులకు రుణమాఫీ కింద 9,654 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసిందని వివరించారు. బ్యాంకు అకౌంట్లు రద్దు చేసుకోవడం, వినియోగంలో లేకపోవడం వంటి కారణాల వల్ల లక్షా 60 వేల మంది వరకు రైతుల ఖాతాల్లో రుణమాఫీ డబ్బు జమ కాలేకపోయిందన్నారు. అయినప్పటికీ సదరు రైతుల ఆధార్‌ నెంబర్‌ ను అనుసంధానం చేసుకుని పరిశీలన జరుపగా, 95845 మందికి రైతుబంధు ఖాతాలు ఉన్నట్లు గుర్తించడం జరిగిందని, వారికి రుణమాఫీ డబ్బులు త్వరలోనే ఖాతాల్లో జమ చేయిస్తామని తెలిపారు.

మిగతా సుమారు 48 వేల మంది రైతులకు సంబంధించి రుణమాఫీ కోసం క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపించాలని కలెక్టర్లకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాధాన్యత క్రమంగా మొత్తం 42 లక్షల మంది రైతులకు ప్రభుత్వం లక్ష రూపాయల లోపు పంట రుణాల మాఫీని వర్తింపజేస్తుందని మంత్రి హరీశ్‌ రావు స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆసరా పెన్షన్‌ పొందుతున్న లబ్ధిదారులు మృతి చెందినట్లైతే వారి జీవిత భాగస్వామికి పెన్షన్‌ మంజూరు చేసేలా చూస్తామన్నారు. గృహలక్ష్మి పధకం క్రింద తీసుకున్న దరఖాస్తులను పరిశీలించి అర్హత గల వారికీ ఆర్థిక సహాయం మంజూరయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా జి.ఓ.. 59 క్రింద వారం రోజుల వ్యవధిలో ఇండ్ల స్థలాల క్రమబద్దీకరణ పూరయ్యేలా చూస్తామన్నారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు మను చౌదరి, చంద్ర మోహన్‌, జిల్లా పరిషత్‌ సీఈఓ సాయ గౌడ్‌, డిఆర్‌ డిఓ సాయన్న, జిల్లా వ్యవసాయాధికారి భాగ్యలక్ష్మి, బ్యాంక్‌ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »