కామారెడ్డి, సెప్టెంబర్ 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎస్పీ ఆఫీసు సమీపంలో గల ఈవీఎం గోడౌన్ ను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మంగళవారం సందర్శించారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను పరిశీలించారు.
సిబ్బంది విధులు నిర్వహిస్తున్న తీరును, పోలీసు భద్రతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈవీఎంలు, బ్యాలెట్ యంత్రాల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు అనిల్ కుమార్, ఇందిర సంబంధిత అధికారులు ఉన్నారు.