ఆర్మూర్, సెప్టెంబర్ 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలంలోని సమాఖ్య కార్యాలయం ఐకేపీలో పనిచేస్తున్న వివోఎస్ (గ్రామ సంఘం సహాయకులు) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 5 వేల 900 రూపాయల నుండి 8 వేల రూపాయలకు వేతనాలు పెంచినందున సిఏం కేసిఆర్‌కు, బిఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డిలకు మంగళవారం పాలాభిషేకం చేశారు.
మహిళల సంక్షేమం కొరకు పనిచేస్తున్న తమకు వేతనాలు పెంపుదలపై హర్షం వక్తం చేస్తూ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమానికి వివోఎస్ యూనియన్ అధ్యక్షురాలు సువర్ణ, కార్యదర్శి జ్యోతి, సహాయ కార్యదర్శి సర్థ సంతోష, అనిత, అమల, అన్ని గ్రామాల నుండి వివోఎస్లు పాల్గొన్నారు.