ఆర్మూర్, సెప్టెంబర్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణం ఎం.జె ఆసుపత్రి అధినేత, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ రాష్ట్ర చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ మధుశేఖర్‌ను నవనాథపురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం పూలమాలలు, శాలువాతో ఘనంగా సన్మానించారు.
నవనాథపురం ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు సాత్ పుతే శ్రీనివాస్, నవనాథ పురం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సుంకరి గంగా మోహన్, ప్రధాన కార్యదర్శి చరణ్ గౌడ్ , కోశాధికారి లిక్కి శ్రావణ్, సలహాదారుడు గణేష్ గౌడ్ డాక్టర్ మధు శేఖర్‌కు శాలువా పూలమాలతో ఘనంగా సన్మానం చేశారు.
రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నతమైన పదవులు పొందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో క్లబ్ సభ్యులు వెంకటేష్ గుప్తా, సామ సురేష్, వినోద్, సూరిబాబు, ముఖేష్, షికారి శ్రీనివాస్ దినేష్, గటడి అరుణ్, మహేష్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.