కామారెడ్డి, సెప్టెంబర్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలోని గిరిజన సంక్షేమ గురుకుల ఎల్లారెడ్డి (బాలికల), బాన్సువాడ (బాలుర) పాఠశాల/ జూనియర్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను పూర్తి తాత్కాలిక పద్ధతిన ఈ విద్యా సంవత్సరం కొరకు పనిచేసే వారి నుండి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ చంద్రమోహన్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఎల్లారెడ్డి లోని బాలికల పాఠశాల/ జూనియర్ కళాశాలలో (01) జువాలజీ, (01) కెమిస్ట్రీ, (01) బోటని, (01) ఇంగ్లీష్, (01) ఫిజికల్ సైన్స్, బాన్సువాడ బాలుర పాఠశాల/ జూనియర్ కళాశాలలో (01) కామర్స్, (01) ఇంగ్లీష్ సబ్జెక్టులో బోధించేందుకు పీజీ 50 శాతం మార్కులతో, బిఈడి, టెట్ లో ఉత్తీర్ణులైన ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 13 లోపు మెదక్‌లోని మినీ గురుకులంలోగల ఆర్సీఓ కార్యాలయంలో (కోర్టు రోడ్డు) దరఖాస్తులు సమర్పించాలని కోరారు. బాలికల పాఠశాలల్లో మహిళలకు మాత్రమే అర్హత ఉందన్నారు. అభ్యర్థుల ఎంపిక డెమో మెరిట్ ఆధారంగా పారదర్శకంగా జరుగుతుందని వివరించారు.