కామారెడ్డి, సెప్టెంబర్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంకితభావంతో పనిచేసిన ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల మన్ననలను పొందుతారని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు.సమర్థత గల అధికారిగా పేరుతెచ్చుకొని పదోన్నతిపై హైదరాబాద్ కు వెళ్లుచున్న జిల్లా సహాకార అధికారిని వసంత కు బుధవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. అన్ని శాఖల ఉద్యోగులతో ఆమె సమన్వయంతో పని చేసిందని కొనియాడారు.
ధాన్యం కొనుగోళ్ల సమయంలో కీలకపాత్ర పోషించారన్నారు. ఈ సందర్భంగా జిల్లాకు నూతనంగా మైనారిటీ సంక్షేమాధికారిగా విచ్చేసిన నవీన్ ను, జిల్లా మహిళా శిశు సంక్షేమాధికారిగా వచ్చిన బావయ్యలను కామారెడ్డి జిల్లాకు సాదరంగా ఆహ్వానిస్తూ అందరం ఒక కుటుంభం సభ్యుల్లా పనిచేద్దామన్నారు. ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వాములు కావాలని కోరారు.
అనంతరం బదిలీపై వెళ్లుచున్న వసంతను, జిల్లాకు నూతనంగా వచ్చన సంక్షేమ అధికారులను కలెక్టర్ సన్మానించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్ర మోహన్, సిపిఒ రాజారామ్,జిల్లా అధికారులు భాగ్యలక్ష్మి, స తీష్ యాదవ్, సింహ రావు, అభిషేక్ సింగ్, మల్లికార్జున్ బాబు, రమ్య, రజిత, సాయిబాబా, వరదా రెడ్డి, దయానంద్, తదితరులు పాల్గొన్నారు.