ఆర్మూర్, సెప్టెంబర్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలో బుధవారం యూత్ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగ ఆర్మూర్ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న మాజీ సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు గోర్త రాజేంధర్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విక్కీ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా గొర్తే రాజేంధర్ మాట్లాడుతూ కాంగ్రెస్‌కు కార్యకర్తలే శ్రీ రామ రక్ష అని, ఒక్క పిలుపుతోనే సుమారు 300 పైచిలుకు యువజన కాంగ్రెస్ కార్యకర్తలు రావడం చాలా సంతోషమని అన్నారు.
ఇక నుండి కార్యకర్తలకు అన్ని వేళలా అందుబాటలో ఉంటానని హామీ ఇచ్చారు. అధిష్టానం ఎవరికీ టికెట్ ఇచ్చిన కలిసి కట్టుగా పని చేసి అభ్యర్థిని గెలిపించుకుంటామని అయన ధీమా వ్యక్తం చేసారు. 25 వేలతో కూడిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వేసి ఉద్యోగ కల్పన చేయాలని నిరుద్యోగ భృతి ఇస్తామని భారాస ప్రభుత్వం యువతను మోసం చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే రెండు లక్షల ఉద్యోగాల భర్తీ చేపడుతుందని, ఆర్మూర్ నియోజకవర్గ కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటానని ఏ కేసులకు భయపడవద్దని టికెట్ ఎవరికి వచ్చిన కలిసికట్టుగా పని చేద్దామని యువజన నాయకులకు దిశ నిర్దేశం చేశారు.
సమావేశంలో పాల్గొన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీకాంత్, ఉపాధ్యక్షులు ప్రశాంత్, ఎన్‌ఎస్‌యుఐ ఆర్మూర్ అధ్యక్షులు బాశెట్టి శశి కుమార్, జిల్లా జనరల్ సెక్రెటరీ సుద్దపల్లి అఖిల్, నియోజవర్గ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ నవనీత్, ఆలూరు మండల అధ్యక్షులు సిరికొండ మహేష్, మాక్లూర్ మండల అధ్యక్షులు రాజు, నందిపేట్ మండల అధ్యక్షులు నాగరాజు, డొంకేశ్వర్ మండల అధ్యక్షులు గోపి పాల్గొన్నారు.