బాన్సువాడ, సెప్టెంబర్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత్ జోడో యాత్ర ప్రారంభించి సంవత్సరం పూర్తయిన సందర్భంగా బాన్సువాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి, రాజీవ్ గాంధీ విగ్రహానికి, ఇందిరాగాంధీ విగ్రహానికి పూల మాలలువేసి అంబేద్కర్ చౌరస్తా నుండి ఎమ్మార్వో కార్యాలయం, కోటగల్లి మీదుగా పోలీస్ స్టేషన్ వరకు పాదయాత్ర చేపట్టిన వారిలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ముఖ్య నాయకులు పిసిసి డెలిగేట్‌లు అడ్వకేట్ వెంకట్ రాంరెడ్డి, డాక్టర్ కూనీపూర్ రాజారెడ్డ్లి, రాష్త్ర ఎంపిటిసిల ఫోరం మాజీ అధ్యక్షులు యలమంచిలి శ్రీనివాస్ రావ్, ఎస్టీ సెల్ ఉపాధ్యక్షులు ప్రతాప్ సింగ్, మాజీ ఎంపిపి శ్రీనివాస్ గౌడ్, సొసైటి చైర్మన్ కమలాకర్ రెడ్డి ఉన్నారు.
వీరు మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు ప్రతి ఒకరం కృషి చేయాలని దీనికి కోసం నిరంతరం కష్టపడదామని అన్నారు. రెండు లక్షల రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే సిలిండర్, 4000 రూపాయల పింఛను, ఇల్లు కట్టుకునే ప్రతి ఒకరికి ఐదు లక్షల రూపాయలు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రాబోవు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇస్తామని అన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.