భిక్కనూరు, సెప్టెంబర్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ దక్షిణ ప్రాంగణంలో కాంట్రాక్ట్ అధ్యాపకులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు రోజుకు చేరాయి. ప్రారంభమైన రిలే నిరాహార దీక్షలను తెలంగాణ విశ్వవిద్యాలయ అవుట్ సోర్సింగ్ అండ్ నాన్ టీచింగ్ గౌరవాధ్యక్షులు ఎల్‌ఎల్‌బి రవి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దశాబ్ద కాలం నుంచి పనిచేస్తూ, యూనివర్సిటీ అభివృద్ధికి తోడ్పడుతున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఆధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. గతంలో చాలీ చాలని జీతాలతో విశ్వవిద్యాలయాల అభివృద్ధికి కృషి చేశారు, రెగ్యులర్ చేయడానికి పూర్తి అర్హులని, ప్రభుత్వం వెంటనే స్పందించి తగు న్యాయం చేయాలన్నారు. కార్యక్రమంలో కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్ నారాయణ మరియు అధ్యాపకులు యాలాద్రి, సునీత, నరసయ్య, రమాదేవి, నిరంజన్, శ్రీకాంత్, సరిత, దిలీప్ పాల్గొన్నారు.