కామారెడ్డి, సెప్టెంబర్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో భిక్కనూరు మండలం గుర్జకుంట గ్రామానికి చెందిన కుంట రాహుల్ రెడ్డి డెంగ్యూ వ్యాధితో ప్లేట్ లేట్స్ సంఖ్య పడిపోవడంతో కామారెడ్డి రక్తదాతల సమూహా క్రియాశీలక సభ్యుడు లక్ష్మీదేవులపల్లి గ్రామానికి చెందిన బద్దం నిశాంత్ రెడ్డి మానవతా దృక్పథంతో స్పందించి ఓ నెగిటివ్ ప్లేట్ లెట్స్ ను శుక్రవారం కామారెడ్డి బ్లడ్ సెంటర్లో అందజేయడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ ప్రస్తుతం డెంగ్యూ వ్యాధి కారణంగా రక్తపలకీకలు తగ్గిపోవడంతో చాలామందికి ప్లేట్‌లేట్స్ అవసరం ఏర్పడిరదని చాలామంది రక్తదానం చేయడానికి ముందుకు వస్తున్నప్పటికీ, ప్లేట్ లెట్స్ అందజేయడానికి ముందుకు రావడం లేదన్నారు.
రక్తదాత నిశాంత్ రెడ్డికి తెలంగాణ టూరిజం కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా మరియు రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షుడు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తరఫున అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో బ్లడ్ బ్యాంక్ ప్రతినిధులు జీవన్, వెంకటేశ్ పాల్గొన్నారు.