నిజామాబాద్, సెప్టెంబర్ 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం పునర్వ్యవస్థీకరణలో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నెలకొల్పిన చీఫ్ ఇంజనీర్ కార్యాలయాన్ని ఆదివారం రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారి విఠల్రావు అదనపు కలెక్టర్ చిత్రా మిశ్రా పోలీస్ కమిషనర్ కే సత్యనారాయణ తదితరులు ప్రారంభోత్సవ సంరంభంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ మారుమూల గ్రామీణ ప్రాంతాలకు మరింత మెరుగైన రోడ్లు కల్వర్టులు వంటి వసతులు అందుబాటులోకి రావాలని సంకల్పంతో ప్రభుత్వం పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ విభాగాన్ని పునర్వ్యవస్థీకరించడం జరిగిందన్నారు ఈ పునర్వ్యవస్థీకరణ ఫలితంగా కొత్తగా మరిన్ని పోస్టులు నెలకొల్పబడ్డాయని అన్నారు. ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చొరవ చూపాలని ఇంజినీరింగ్ విభాగం అధికారులకు మంత్రి హితవు పలికారు.
స్థానికంగా చీఫ్ ఇంజనీర్ కార్యాలయం ఏర్పాటు కావడం వల్ల వివిధ పనుల కోసం హైదరాబాదుకు వెళ్లే అవసరం లేకుండా స్థానికంగానే సకాలంలో వేగంగా పనులు జరిగేందుకు ఆస్కారం ఏర్పడిరదన్నారు. ఈ సందర్భంగా చీఫ్ ఇంజినీర్‌గా బాధ్యతలు స్వీకరించిన జి.సీతారాములుకు, ఇతర అధికారులకు మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ఇంజినీరింగ్ అధికారులు భావన్నా, ప్రభాకర్, రాజేశ్వర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.