కామారెడ్డి, సెప్టెంబర్ 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మెదక్ జిల్లా మీర్జాపల్లి గ్రామానికి చెందిన బండి ప్రసన్న గర్భిణీ మహిళలకు అత్యవసరంగా ఓ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో కామారెడ్డి జిల్లా రెడ్డిపేట్ గ్రామానికి చెందిన బుర్ర ప్రశాంత్ గౌడ్ మానవతా దృక్పథంతో స్పందించి 7వ సారి రక్తదానం చేసి ప్రాణదాతగా నిలవడం జరిగిందని ఐవీఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలిపారు.
2007వ సంవత్సరంలో కామారెడ్డి రక్తదాతల సమూహాన్ని ఆపదలో ఉన్న వారికి సకాలంలో రక్తాన్ని అందించాలని మంచి సంకల్పంతో ప్రారంభించడం జరిగిందని నేడు కామారెడ్డితో పాటుగా రాష్ట్రవ్యాప్తంగా అత్యవసరంగా ఉన్నవారికి కావాల్సిన రక్తాన్ని అందజేసి వేలాదిమంది ప్రాణాలను కాపాడడం జరిగిందన్నారు. నేటి సమాజంలో యువత సామాజిక దృక్పథాన్ని అలవర్చుకోవాలని,తోటి వారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు స్పందించే గుణాన్ని కలిగి ఉండాలని అన్నారు.
రక్తదాత ప్రశాంత్ గౌడ్‌కు తెలంగాణ టూరిజం పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా మరియు రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షుడు,జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తరపున అభినందనలు తెలిపారు.