కామారెడ్డి, సెప్టెంబర్ 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బానిస బతుకుల విముక్తి కోసం పోరాటం చేసిన వీర వనిత చాకలి ఐలమ్మ అని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ సమీపంలో ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
వేడుకలకు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ హాజరై ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం రజాకర్ల ఉద్యమంలో ఆమె చేసిన పోరాటాన్ని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాస్, సహాయ బిసి ఆఫీకారి యాదగిరి, వసతి గృహ అధికారులు, రజక సంఘాల ప్రతినిధులు, ఎన్జీవోఎస్ కార్యదర్శి సాయిలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాల ప్రతినిధులు రాజయ్య, మల్లయ్య, సంగయ్య, తదితరులు పాల్గొన్నారు.