కామారెడ్డి, సెప్టెంబర్ 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చిన 46 ఫిర్యాదులను, వినతులను ప్రజల నుంచి జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ స్వీకరించారు.
అర్జీలను సంబంధిత శాఖ అధికారులకు సిఫారసు చేశారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వ్యయప్రయాసలకోర్చి వస్తున్న ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు.
ఫిర్యాదులను శాఖల వారీగా స్వీకరించి వాటి పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలన్నారు. ప్రజావాణిలో వస్తున్న ఫిర్యాదులను పెండిరగ్‌లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఎవో మసూర్ అహ్మద్, కలెక్టరేట్ లోని వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.