కామారెడ్డి, సెప్టెంబర్ 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా పరిషద్ స్థాయి సంఘ సమావేశాలు ఈ నెల 13, 14 తేదీలలో జిల్లా ప్రజా పరిషత్ స్థాయి సంఘ సమావేశపు హాలు నందు నిర్వహించనున్నామని జిల్లా పరిషద్ ముఖ్య కార్య నిర్వహణాధికారి సాయ గౌడ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 13 న ఉదయం 10. 30 గంటలకు గ్రామీణాభివృద్ధిపై 2వ స్థాయి, మధ్యాన్నం ఒంటి గంటకు విద్య, వైద్యం పై 4 వ స్థాయి, మధ్యాన్నం 3 గంటలకు పనులపై 7వ స్థాయి, ఆర్ధిక, ప్రణాళిక పై ఒకటవ స్థాయి సంఘ సమావేశాలు నిర్వహించనున్నామని అన్నారు.
14 న ఉదయం 10. 30 గంటలకు సాంఫీుక సంక్షేమం పై 6వ స్థాయి, మధ్యాన్నం ఒంటి గంటకు మహిళా శిశు సంక్షేమం పై 5వ స్థాయి, 3 గంటలకు వ్యవసాయంపై 3వ స్థాయి సంఘ సమావేశాలు నిర్వహించనున్నామని ఆయన తెలిపారు. స్థాయి సంఘ సభ్యులు సకాలంలో హాజరు కావాలని, సంబంధిత అధికారులు సమగ్ర సమాచారంతో సమావేశానికి హాజరు కావాలని సాయగౌడ్ కోరారు.