సకాలంలో రక్తదానం చేసిన చంద్రం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాదులోని కొత్తపేటలో గల ఓజోన్‌ హాస్పిటల్‌ నందు సామ వీరమ్మ (91) కి ఆపరేషన్‌ నిమిత్తమై బి పాజిటివ్‌ రక్తం అవసరమని ఐవిఎఫ్‌ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు చందా భాగ్యలక్ష్మి ఐవిఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌ మరియు రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలును సంప్రదించారు.

మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలం శెట్టిపల్లి కలాన్‌ గ్రామానికి చెందిన బ్యాంకర్స్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్మెంట్‌ రాజేందనగర్‌లో అకౌంటెంట్‌గా విధులు నిర్వహిస్తున్న జంగిటి చంద్రం మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి సకాలంలో రక్తాన్ని అందజేశారన్నారు.

రక్తదానం చేసిన రక్తదాత జంగిటి చంద్రం తెలంగాణ టూరిజం కార్పొరేషన్‌ పూర్వ చైర్మన్‌ ఐవిఎఫ్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా అభినందనలు తెలిపారు. గతంలో కూడా మీరు అత్యవసర సమయంలో రక్తాన్ని అందజేసి ప్రాణదాతగా నిలవడం అభినందనీయమన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »