నిజామాబాద్, సెప్టెంబర్ 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రం నర్సింగపల్లిలో ‘‘స్వర్ణామృత’’ ప్రాశన కార్యక్రమం జరిగిందని ఆలయ ధర్మకర్త నర్సింహరెడ్డి ప్రకటనలో తెలిపారు. 0-15 వయసుగల పిల్లలకు ఈ దివ్యౌషధం ఉచితంగా గత తొమ్మిది సంవత్సరాల నుండి దాదాపు 3 లక్షల 25 వేల మందికి ఇచ్చామని తెలిపారు.
ప్రతి మాసంలో వచ్చే పుష్యమి నక్షత్రం రోజు నెలకు ఒక్కసారి మాత్రమే ఉదయం 7 గంటల నుండి 12:30 గంటల వరకు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ ఔషధం తీసుకున్న పిల్లల్లో రోగ నిరోదక శక్తి పెరగడంతో పాటు చలాకీగా ఉండడం ధారణ శక్తి మరియు జ్ఞాపకశక్తి అపారంగ పెరగడం చూసామని అన్నారు. ఆలయంలో ఇచ్చే ప్రతి ఔషధం ఉచితంగానే ఇస్తామని తెలిపారు. సేవా కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు రోహిత్ కుమారాచార్య తో పాటు రమేష్, నర్సారెడ్డి, రవిందర్ యాదవ్, మారుతి, నరేష్ తదితరులు పాల్గొన్నారు.