కామారెడ్డి, సెప్టెంబర్ 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలో మంగళవారం క్షేత్రస్థాయిలో గణేష్ నిమజ్జన శోభయాత్ర రూట్ మ్యాప్‌ను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. కామారెడ్డి పట్టణంలోని సిరిసిల్ల రోడ్డు, స్టేషన్ రోడ్, వీక్లీ మార్కెట్ రోడ్డు, వేణుగోపాల స్వామి రోడ్, అంబేద్కర్ చౌరస్తా మీదుగా నిజాంసాగర్ చౌరస్తా, కొత్త బస్టాండ్ చౌరస్తా నుంచి అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు వరకు వెళ్లి రోడ్లను పరిశీలించారు.
కొన్నిచోట్ల విద్యుత్ లూజు వైర్లు ఉన్నట్లు గుర్తించారు. వాటిని విద్యుత్ శాఖ అధికారులు బాగు చేయాలని సూచించారు. రోడ్లపై ఉన్న గుంతలను మున్సిపల్ అధికారులు పూడ్చివేయాలని ఆదేశించారు. అవసరమైన చోట్ల బ్యారికెడ్స్ ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో డీఎస్పీ ప్రకాష్, సిఐ నరేష్, మున్సిపల్ కమిషనర్ దేవేందర్, తహసిల్దార్ లత, రెవెన్యూ, మునిసిపల్ శాఖల అధికారులు పాల్గొన్నారు.