కామారెడ్డి, సెప్టెంబర్ 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహిళా సంక్షేమం, ఆరోగ్య రక్షణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని రాజీవ్ నగర్ అర్బన్ పిహెచ్సిలో మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రతి మంగళవారం మహిళలకు ఉచితంగా 8 రకాల వైద్య పరీక్షలు, మందులు, చికిత్స అందిస్తారని తెలిపారు.
ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు, మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వైద్య సిబ్బంది సేవా భావంతో పనిచేయాలని కలెక్టర్ కోరారు. మహిళల ఆరోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. కార్యక్రమంలో మునిసిపల్ వైస్ చైర్ పర్సన్ ఇందు ప్రియా, వైద్యురాలు సాయి ఈశ్వరి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.