బాన్సువాడ, సెప్టెంబర్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలంలోని తిరుమలపూర్ గ్రామ శివారులో నిర్మాణంలో ఉన్న 33/11 కేవీ సబ్ స్టేషన్ను టీఎస్ ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ ఆపరేషన్ వరంగల్ మోహన్ రెడ్డి బుధవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన సబ్ స్టేషన్ నిర్మాణ పనులను వరిత గతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు. కార్యక్రమంలో జిల్లా విద్యుత్ అధికారి రమేష్ బాబు, డి ఈ రామయ్య, బాన్సువాడ డివిజనల్ అధికారి కామేశ్వరరావు, ఏఈ నాందేవ్ విద్యుత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.