కామారెడ్డి, సెప్టెంబర్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నియోజికవర్గంలోని దేవాలయాలకు, పలు కుల సంఘాలకు, భవన నిర్మాణాలకు 15 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియాతో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మాట్లాడారు.
కామారెడ్డి నియోజికవర్గంలోని పలు దేవాలయాలకు, కుల సంఘ భవన నిర్మాణాలకు 399 పనులకు 15 కోట్ల రూపాయల నిధులు మంజూరైనట్టు తెలిపారు. త్వరలోనే వీటికి సంబంధించిన ఇంజనీర్లు పిలిపించి పనులు ప్రారంభించే విధంగా చూస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దిన్, ఎంపిపి ఆంజనేయులు, పార్టీ సీనియర్ నాయకులు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, అధికార ప్రతినిధులు బలవంతరావు, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.