రాష్ట్రపతిచే దృశ్యమాధ్యంలో ఆయుష్మాన్‌ భవ ప్రారంభోత్సవం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయుష్మాన్‌ భవ కార్యక్రమాన్ని దృశ్య శ్రవణ మాధ్యమంలో గుజరాత్‌ రాజభవన్‌ నుండి ప్రారంభించారు. కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో అడిషనల్‌ కలెక్టర్‌ చిత్రా మిశ్రా ఆధ్వర్యంలో ఐడిఓసి లోని వీడియోకాన్ఫరెన్స్‌ హాల్లో పాల్గొని వీక్షించారు.

ఈ సందర్భంగా ఆయుష్‌ ఆరోగ్య సేవలను బలోపేతం చేస్తూ, ఆయుష్‌ హెల్త్‌ వెల్నెస్‌ సెంటర్స్‌లలో అందించే ఆయుష్‌ ఆరోగ్య సేవల ద్వారా ఆరోగ్యాన్ని సంరక్షిస్తూ, ముఖ్యంగా ఆయుర్వేద, యోగ, యునాని, సిద్ధ, హోమియోపతి, మరియు నేచురోపతి వైద్య విధానాల ద్వారా ప్రాథమిక ఆరోగ్య సంరక్షణతో పాటు శారీరక, మానసిక ఎదుగుదల మరియు సాధారణ ఆరోగ్య సంరక్షణను అందిస్తూ దేశ వ్యాప్తంగా ప్రతి గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో ఈ సేవలను విస్తరిస్తూ చిట్టచివరి లబ్ధిదారునికి కూడా ఆయుష్‌ ఆరోగ్య సేవలు అందించాలని తెలిపారు.

అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ వెల్నెస్‌ సెంటర్స్‌లలో అందించే సేవలు ముఖ్యంగా ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ అకౌంట్‌ ఐడి క్రియేషన్‌, సంక్రమితా మరియు అసంక్రమిత వ్యాధుల చికిత్స, మాతా శిశు ఆరోగ్య సేవలను, సరిjైున పోషకాహారంపై అవగాహన, మానసిక వ్యాధిగ్రస్తులకు వయోవృద్ధులకు చికిత్స, పాలిటివ్‌ కేర్‌, జీవనశైలిపై విద్యార్థులు, కిషోర్‌ బాలికలు మరియు యువతకు అవగాహన మరియు కౌన్సిలింగ్‌తో పాటు గ్రామస్థాయిలో ఆరోగ్య సభలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

ఈ సందర్భంగా ఆయుష్‌ ఆరోగ్యకరదీపికలను అడిషనల్‌ కలెక్టర్‌ మరియు డిఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఎం సుదర్శనం గారి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిఎంహెచ్వో మాట్లాడుతూ, ఆయుష్‌ ఆరోగ్య సేవలను విస్తరించడంతోపాటు విస్తృతంగా రక్తదాన శిబిరాలను నిర్వహించాలని అదేవిధంగా అవయవ దానంపై ప్రజల్లో అవగాహన కలిగిస్తూ అవయవదానాన్ని చేసేలాగా వారిని కౌన్సిలింగ్‌ చేయాలన్నారు. ఈ సందర్భంగా అవయవ దానంపై ఈ కార్యక్రమానికి విచ్చేసిన వివిధ శాఖల అధికారులచే మరియు వైద్య సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించారు.

ఈ సందర్భంగా క్షయ వ్యాధిగ్రస్తులకు న్యూట్రిషన్‌ కిట్లను అందిస్తున్నందుకు స్వచ్ఛంద సేవా సంస్థలు సూర్య హెల్త్‌ ఆర్గనైజేషన్‌ నుండి ప్రసాద్‌ గారికి మరియు ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ జిల్లా సెక్రెటరీ బుస్స ఆంజనేయులుకి అడిషనల్‌ కలెక్టర్‌ మరియు డీఎంహెచ్‌ఓ చేతుల మీదుగా ప్రశంస పత్రం మరియు శాలువాతో సత్కరించారు.

కార్యక్రమంలో ఆయుష్‌ జిల్లా కోఆర్డినేటర్‌ డాక్టర్‌ రమణ మోహన్‌, జిల్లా సంక్షేమ అధికారిని రసూల్‌ బి, పి ఓ డి టి టి డాక్టర్‌ నాగరాజు, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ మేడం ప్రతినిధి, డిప్యూటీ డిఎం అండ్‌ హెచ్‌ ఓ నిజామాబాద్‌ డాక్టర్‌ సరిత, ఎన్సిడి ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ రవితేజ, కేర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ చైతన్య కుమార్‌, ఏవో గంగాధర్‌, డిపిఓ విశాల రాణి, డిహెచ్‌ఇ ఘన్పూర్‌ వెంకటేశ్వర్లు, జిల్లా టిబి కోఆర్డినేటర్‌ రవి గౌడ్‌, డిపిఎం సుధాకర్‌, సూపర్వైజర్‌ మధుకర్‌ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »