ఆర్మూర్, సెప్టెంబర్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీమ్గల్ మండలంలోని కేజీబీవీ హాస్టల్ విద్యార్థులు అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న విద్యార్థులను ఏఐబిఎస్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తారాచంద్ నాయక్ మరియు ఎల్‌ఎస్‌వో జిల్లా అధ్యక్షుడు రాథోడ్ జీవన్ నాయక్ పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కలుషిత ఆహారం తిని 80 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారని, అధికారుల నిర్లక్ష్యం వలనే ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సంఘటనలో హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యం వల్ల నాణ్యతలేని సరుకులు కొని విద్యార్థులకు వండి పెట్టడం వల్ల, శుభ్రమైన భోజనాన్ని వండి పెట్టకపోవడం వలన ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని ఇలాంటి సంఘటనలు జరగకుండా జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా గిరిజన సంఘాల తరఫున డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో ఏఐబిఎస్‌ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మణ్ నాయక్ మరియు జిల్లా విశ్రాంతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రామ్ రావ్ చౌహన్, గెజిటెడ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు బాబూలాల్, ఎల్‌ఎస్‌వో జిల్లా కార్యదర్శి యాదవ్ సాయి కృష్ణ, ఏఐబిఎస్‌ఎస్ జిల్లా కోశాధికారి రమేష్ రాథోడ్, శీను నాయక్ తదితరులు పాల్గొన్నారు.