నిజామాబాద్, సెప్టెంబర్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర పశు సంవర్థక, మత్స్య శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9.45 గంటలకు డిచ్పల్లి మండలం నడిపల్లి చేరుకోనున్న మంత్రి తలసాని, స్థానికంగా ఏర్పాటు చేస్తున్న ఫిష్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
అదేవిధంగా జిల్లా కేంద్రంలోని అర్సపల్లి లోనూ ఫిష్ మార్కెట్ నిర్మాణానికి భూమి పూజ చేసిన మీదట, మోపాల్ మండలం న్యాల్కల్ గ్రామంలోని మాసాని చెరువులో చేప విత్తనాలు విడుదల చేసి, మత్స్యకారులతో మంత్రి భేటీ కానున్నారు. కార్యక్రమాల అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు తిరిగి హైదరాబాద్ బయలుదేరి వెళ్లనున్నారు.