ఆర్మూర్, సెప్టెంబర్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తోర్తి గ్రామానికి చెందిన నవ్య లావణ్యకి తన కొడుకును చంపినందుకు నిందితురాలిని దోషిగా నిర్దారించి, జీవిత ఖైది, అలాగే రెండు వేల రూపాయల జరిమానాను జిల్లా కోర్ట్ న్యాయమూర్తి సునీత విధించారు. వివరాల్లోకి వెళ్తే…
దోషి భర్త దుబ్బాయికి వెళ్లాడు, దోషి భర్త లేకపోవడంతో గత మూడేళ్లుగా ఒక వ్యక్తితో ఆమె అక్రమ సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తోంది. ఆమెకు నాలుగు సంవత్సరాల నాగేంద్ర అనే కుమారుడు ఉన్నాడు. వారి అక్రమ సంబంధానికి తన కొడుకు అడ్డు వస్తున్నాడని, ఆమె తన కొడుకును చంపడానికి పథకం రూపొందించి 2020 నవంబర్ 12 వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు తన కొడుకు గొంతును చేతులతో నొక్కి, బ్లౌజ్‌తో గొంతు నులిమి హత్య చేసింది. యావజ్జీవ కారాగార శిక్ష పడినందుకు గాను కృషి చేసిన కోర్టు కానిస్టేబుల్ బి.ప్రవీణ్, ఎస్.హెచ్ ఓ. జె.మచేందర్ రెడ్డి, పి.ఎస్. సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, భీమ్‌గల్ ఎ. వెంకటేశర్లు, ఏసీపీ ఆర్మూర్ జగదీష్ చందర్‌లను నిజామాబాదు పోలీస్ కమీషనర్ వి. సత్యనారాయణ అభినందిస్తూ వారికి రివార్డులు ప్రకటించారు.