ఆర్మూర్, సెప్టెంబర్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి ప్రారంభించిన జీవన నిత్యాన్నదాన కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుంది. ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్, ఆర్మూర్, ఆలూర్, నందిపేట్, డొంకేశ్వర్, మాక్లూర్ మండలాల్లోని అన్ని గ్రామాలకు చెందిన ప్రజలు వివిధ పనుల నిమిత్తం ఆర్మూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వస్తుంటారు.
పనుల కోసం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చే ప్రజలు ఇబ్బందులు పడవద్దని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి ప్రజల ఆకలి దప్పులు తీర్చేందుకు క్యాంపు కార్యాలయ ఆవరణలో నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి చేపడుతున్నారు.
ఆర్మూర్ ఎమ్మెల్యే ప్రారంభించి చేపడుతున్న నిత్య అన్నదాన కార్యక్రమం పట్ల ఆర్మూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చే ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ, ప్రజల ఆకలి తీర్చేందుకు నిత్యం ప్రారంభించిన జీవన్ రెడ్డి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడని ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ యువజన విభాగం నాయకులు చేపూర్ షాహిద్, మీరా శ్రావణ్, మల్యాల నర్సారెడ్డి, అగ్గు క్రాంతి తదితరులు పాల్గొన్నారు.