బాన్సువాడ, సెప్టెంబర్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఆధ్వర్యంలో బస్‌డిపో నుండి పాదయాత్ర, ర్యాలీ పిఆర్ గార్డెన్ కొయ్యగుట్ట వరకు కొనసాగింది.
నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో సుమారు 1,800 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యకర్తల అభిప్రాయం మేరకే ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించాలని అన్నారు. ఎమ్మెల్యే దరఖాస్తు అభ్యర్థులు డాక్టర్ కూనీపూర్ రాజారెడ్డి, వెంకట్ రాంరెడ్డి, యలమంచిలి శ్రీనివాస్ రావ్, ప్రతాప్ సింగ్, ఇందూర్ చంద్రశేఖర్, మాజీ ఎంపిపి శ్రీనివాస్ గౌడ్, డాక్టర్ అనిల్ రెడ్డి మాట్లాడుతూ మనలో ఎవరికి టికెట్ వచ్చిన కలసి కట్టుగా గెలిపిద్ధామన్నారు.