బాన్సువాడ, సెప్టెంబర్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలంలోని అన్ని గ్రామాల్లో బిజెపి పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రతి బిజెపి కార్యకర్తపై ఉందని పార్టీ మండల అధ్యక్షుడు వడ్ల శేఖర్ అన్నారు.
గురువారం బాన్సువాడ పట్టణంలోని బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతి కార్యకర్త ఇప్పటినుండే బూత్ స్థాయిలో ఉన్న ఓటర్లకు రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వివరిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు అవగాహన కల్పించి ఎన్నికల్లో బాన్సువాడ నియోజకవర్గంపై బిజెపి జెండా ఎగర వేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.
కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు వడ్ల శేఖర్, మాజీ అధ్యక్షుడు సాయిబాబా, ఆయా గ్రామాలనుండి వచ్చిన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.