నిజామాబాద్, సెప్టెంబర్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలోని ఆంధ్రనగర్ గ్రామ పంచాయతీకి రాష్ట్ర స్థాయిలో స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ అవార్డు వరించింది. స్వచ్చ సర్వేక్షణ్ గ్రామీణ 2023 లో ఉత్తమ పనితీరు కనబరిచిన గ్రామ పంచాయతీలకు అవార్డులు ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం, త్రాగునీరు, పారిశుధ్యం, పచ్చదనం, తదితర అంశాలను ప్రాతిపదికగా ఎంపిక ప్రక్రియను నిర్వహించింది.
ఈ మేరకు ఆంధ్రనగర్ జీ.పీ అవార్డుకు ఎంపికవగా, గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయత్ రాజ్ సంచాలకులు హన్మంతు రావు, సెర్ప్ సీఈఓ గౌతమ్, ఎస్.బీ.ఎం డైరెక్టర్ సురేష్ బాబుల చేతుల మీదుగా ఆంధ్రనగర్ సర్పంచ్ నాయుడు రామారావు, పంచాయతీ కార్యదర్శి ఐనార్ల సందీప్ లు అవార్డు అందుకున్నారు.
కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి చందర్నాయక్, డీపీఓ జయసుధ, ఎంపీడీఓ నాగవర్ధన్, ఎంపిఓ కిరణ్ కుమార్, ఎస్బీఎం సమన్వయకర్త నరేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.