బిచ్కుంద, సెప్టెంబర్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బిచ్కుంద మండలంలోని స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట శుక్రవారం 5వ రోజు చేపట్టిన అంగన్వాడీ ఉద్యోగుల నిరవధిక సమ్మెలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్ హాజరై కాంగ్రెస్ పార్టీ అంగన్వాడీల సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇస్తుందని ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలకు కనీస వేతనం నెలకు 26 వేలు చెల్లించాలని, అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.