ఆర్మూర్, సెప్టెంబర్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత ప్రభుత్వము సమాచార మంత్రిత్వ పోస్టల్ శాఖ డిసిడిపి డక్ కమ్యూనిటీ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ ఆర్మూర్ మండలంలోని ఫత్తేపూర్ బ్రాంచ్ పోస్టాఫీస్ ఆధ్వర్యంలో శుక్రవారం ఫత్తేపూర్ గ్రామ పంచాయతిలో ఏర్పాటు చేసిన సమావేశంలో స్థానిక సర్పంచ్ కొత్తపల్లి లక్ష్మి, ఎంపీటీసి కొక్కుల హన్మాండ్లు, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి.వెంకట్ నర్సయ్య, ఎస్పీఎం, ఎంవోలు చంద్రశేఖర్, దశరథ్ స్థానిక బీపీఎం దివ్య పాల్గొన్నారు.
బీపీఎం వెంకటేష్ మాట్లాడుతూ పోస్టల్ స్కీమ్స్ గురించి ప్రజలకు అవగాహన కలిగించారు. ప్రతీ ఒక్కరూ పోస్టాఫీసులో సేవింగ్ ఖాతాలు, ఆర్డీలు, సుకన్య సమృద్ధి యోజన అకౌంట్లు మీ సౌలభ్యం కొరకు తెరిచి వినియోగించుకొని ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మెయిల్ వోవారీస్ చంద్రశేఖర్, దశరథ్, బీపీఎంలు సీహెచ్ దివ్య, వెంకటేష్ పోస్టల్ స్కీమ్స్ గురించి ప్రజలకు అవగాహన కలిగించారు. కార్యక్రమంలో బీపీఎంలు ఏబీపిఎంలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.