నిజామాబాద్, సెప్టెంబర్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హరిదా రచయితల సంఘం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17న ఉదయం 9 గంటలకు నిజామాబాద్ నగరంలోని కేర్ డిగ్రీ కళాశాలలో ప్రముఖ యువ కవయిత్రి మాదస్త ప్రణవి రచించిన పాలకంకులు పుస్తకావిష్కరణ సభ జరుగుతుందని హరిదా రచయితల సంఘం అధ్యక్షులు ఘనపురం దేవేందర్ తెలిపారు.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ జాగృతి సాహిత్య విభాగం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ కాంచనపల్లి, గౌరవ అతిథులుగా జిల్లా యువజన సమన్వయకర్త శైలి బెలాల్, నవ్య భారతి విద్యాసంస్థల అధినేత క్యాతం సంతోష్ కుమార్, తెలంగాణ రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్, తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షులు అవంతి కుమార్ హాజరవుతారని డాక్టర్ కాసర్ల పుస్తక పరిచయం నిర్వహిస్తారని జిల్లాలోని సాహితీవేత్తలు సాహిత్యాభిమానులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.