బాన్సువాడ, సెప్టెంబర్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తపాలా శాఖ ఆధ్వర్యంలో చిన్నారుల నుండి వృద్ధుల వరకు తగిన పథకాల సేవలను ప్రజలు వినియోగించుకోవాలని బోధన్ సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ వేణు అన్నారు. శుక్రవారం బాన్సువాడ పట్టణంలో తపాలా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్ కమ్యూనిటీ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా ఆయన పాల్గొని మాట్లాడారు.
దేశంలోని ప్రతి కుటుంబానికి ఒక్క ఖాతా తెరిచే లక్ష్యాన్ని నిర్దేశించుకుని తపాలా శాఖ తనవంతుగా దేశ సమతుల్యత ఆర్థిక అభివృద్ధిలో పాలుపంచుకొని పనిచేస్తుందన్నారు. అన్ని తపాలా శాఖలో200 పిఓ ఎస్‌బి ఖాతాలు, 30 తపాలా బీమాలను ఓపెన్ చేయించారు. బాన్సువాడ పోస్ట్మాస్టర్, భీమ్లా నాయక్, రూపేష్, సూర్యకాంత్, సాయినాథ్, సాయిలు, చంద్రశేఖర్, రవీందర్ తపాలా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.