నిజామాబాద్, సెప్టెంబర్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అక్టోబర్ 2 మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో యువతకు జిల్లా స్థాయి ఉపన్యాస పోటీలు నిర్వహించారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా నెహ్రూ యువ కేంద్ర జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న పోటీలలో భాగంగా జిల్లా స్థాయిలో జరిగిన ఉపన్యాస పోటీలలో ప్రథమ స్థానంలో శ్రీజ జాదవ్, ద్వితీయ స్థానంలో చరణ్ తేజ నిలిచారు.
‘‘నేటి ప్రపంచానికి గాంధేయవాద ఆవశ్యకత’’ అనే అంశం మీద జరిగిన ఈ పోటీల్లో గెలుపొందిన వారు రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీలకు ఎంపికయ్యారని జిల్లా యువజన అధికారిణి, శైలి బెల్లాల్ తెలిపారు. రాష్ట్ర స్థాయిలో గెలిచిన వారు అక్టోబర్ 2 రోజున జాతీయ స్థాయిలో పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగే పోటీలలో పాల్గొననున్నారు.
ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ జాదవ్, చరణ్ తేజ లను నెహ్రూ యువ కేంద్ర అధికారిణి శైలి బెల్లాల్ అభినందించారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయికి ఎంపికై జాతీయ స్థాయిలో కూడా గెలిచి మన జిల్లాకి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.