బాన్సువాడ, సెప్టెంబర్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వర్ని మండలంలోని కొట్టయ్యాక్యాంప్‌లో గల గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో గురువారం ఉదయం పారిపోయిన బాలుడు యశ్వంత్ గురించి వివరాలను ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్, తెలంగాణ జన సమితి విద్యార్థి విభాగం జిల్లా నాయకులు మావురం శ్రీకాంత్ ప్రిన్సిపాల్‌ను అడిగి తెలుసుకున్నారు.
గురువారం ఉదయం తమ ఆశ్రమ పాఠశాల నుంచి పారిపోగా సాయంత్రం నిజామాబాద్ వారి బంధువుల ఇంటికి వెళ్లారని శుక్రవారం ఉదయం వారి తల్లిదండ్రులు వసతి గృహానికి తీసుకువచ్చారన్నారు. విద్యార్థి సంఘం నాయకుల, ప్రిన్సిపాల్ మరియు స్టాప్, వారి తల్లిదండ్రుల సమక్షంలో బాలుడు యశ్వంత్ తాను హాస్టల్‌లో ఉండలేను తన సొంత గ్రామంలోనే తమ ఇంటిదేగ్గరనే ఉండి చదువుకుంటానని తెలిపారన్నారు.
ఇట్టి విషయమై ప్రిన్సిపాల్ రాధాను వివరణ కోరగా విద్యార్థి వసతి గృహంలో ఉండి చదువుకోడానికి ఇష్టం లేదని వారి తల్లిదండ్రుల సమక్షంలో చెప్పడం జరిగిందని ఆమె తెలిపారు.