నిజామాబాద్, సెప్టెంబర్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : టెట్ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్లో గల ఎస్.వీ కళాశాలలో కొనసాగుతున్న పరీక్ష కేంద్రాన్ని సందర్శించారు. పరీక్షల నిర్వహణ తీరుతెన్నులను నిశితంగా పరిశీలన జరుపుతూ, చీఫ్ సూపరింటెండెంట్‌ను కలెక్టర్ పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.
నిబంధనలను పాటిస్తూ, సమయానుసారంగానే ప్రశ్నాపత్రాల బండిళ్లను తెరిచారా అని ఆరా తీశారు. పరీక్ష రాస్తున్న అభ్యర్థులకు తాగునీటి వసతి అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, కాపీయింగ్‌కు అవకాశం లేకుండా రెండవ సెషన్ టెట్ పరీక్ష కూడా పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తును పరిశీలించారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా అధికారుల దృష్టికి తేవాలని చీఫ్ సూపరింటెండెంట్‌కు సూచించారు.