కామారెడ్డి, సెప్టెంబర్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం కామారెడ్డి జిల్లా కోర్టులో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో మట్టి వినాయకులను పూజిద్దాం, పర్యావరణ కాలుష్యాన్ని అరికడుదాము అనే నినాదంతో ‘‘రామకృష్ణ మెడికల్’’ సహకారంతో మట్టి వినాయకులను కోర్ట్ ఆవరణలో జిల్లా జడ్జి యస్.యన్. శ్రీదేవి చేతుల మీదుగా అడ్వొకేట్స్, కోర్ట్ సిబ్బంద్దికి పంపిణి చేశారు.
కార్యక్రమంలో జిల్లా కోర్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజ్ గోపాల్ గౌడ్, అడ్వొకేట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు శ్రీధర్ మరియు లాయర్లు, సిబ్బంది పాల్గొన్నారు.