బాన్సువాడ, సెప్టెంబర్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రవ్యాప్త సమ్మెలో భాగంగా బాన్సువాడ పట్టణంలోని ఐసిడిఎస్ కార్యాలయం ముందు అంగన్వాడీ ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మెలో భాగంగా ఆదివారం మోకాళ్లపై నిల్చుని నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకపోతే మలిదశ తెలంగాణ ఉద్యమ పోరాటాన్ని గుర్తు చేస్తామన్నారు. అంగన్వాడి ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనాన్ని అమలు చేసి ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత, పిఎఫ్ సౌకర్యం కల్పించి నెలకు నాలుగు రోజులు సెలవులు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో మహాదేవి, విజయ, శివగంగ, సరిత, అనురాధ, విజయలక్ష్మి, ఇందిరా, బాలమణి, స్వరూప తదితరులు పాల్గొన్నారు.