ఎడపల్లి, సెప్టెంబర్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తాము అధికారంలోకి రాగానే సెప్టెంబర్17 ను తెలంగాణా విమోచన దినోత్సవంగా ప్రభుత్వమే అధికారికంగా జరుపుతుందని చెప్పిన తెలంగాణారాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయి 9 ఏండ్లు గడుస్తున్నా సీఎం కెసిఆర్ ఒకే వర్గానికి కొమ్ముకాస్తూ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపడం లేదని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ విమోచన దినోత్సవాల్లో భాగంగా శనివారం ఎడపల్లి మండలంలోని నెహ్రునగర్ నుండి ఎడపల్లి బీజేపీ కార్యాలయం వరకు నిర్వహించిన బైక్ ర్యాలీలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… నిజాం పాలన నుండి తెలంగాణా విముక్తి రోజును 2014 ఎన్నికల ముందు తాము అధికారంలో వచ్చిన వెంటనే సెప్టెంబర్ 17 ను అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తామని చెప్పారని, బిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి 9 సంవత్సరాలు గడుస్తున్నా కేవలం ఒక వర్గం ఓట్ల కోసం సెప్టెంబర్ 17 ను అధికారికంగా నిర్వహించడం లేదని ద్వజమెత్తారు.
రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చిన తరువాత తెలంగాణా విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహిస్తామని అన్నారు. ఆయన వెంట జిల్లా కార్యదర్శి సుధాకర్ చారి, బోధన్ అసెంబ్లీ నియోజకవర్గ కన్వినర్ శ్రీధర్, వివిధ మండలాల అధ్యక్షులు ఇంద్రకరణ్, కొలిపాక బాలరాజు, గోపికృష్ణ, సరిన్, ప్రవీణ్, బిజెపి కార్యకర్తలు తదితరులు భారీగా పాల్గొన్నారు.