నిజామాబాద్, సెప్టెంబర్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
విఘ్నాలు తొలగించే ఆది దేవుడైన వినాయకుని వేడుకలను ఎప్పటిలాగే సహృద్భావ వాతావరణంలో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. వినాయక చవితి పండుగ ప్రతి ఇంటా సుఖసంతోషాలు నింపాలని, గణనాథుడి కృపాకటాక్షాలతో తెలంగాణ రాష్ట్రం మరింత ప్రగతి సాధిస్తుందని ఆశాభావం వెలిబుచ్చారు.