బాన్సువాడ, సెప్టెంబర్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నైజాం విముక్త స్వాతంత్ర అమృత్సవాల భాగంగా తపస్ బాన్సువాడ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భునేకర్ సంతోష్ మాట్లాడుతూ సెప్టెంబర్ 17వ తేదీన 1948 సంవత్సరంలో తెలంగాణకు నిజమైన స్వాతంత్రం రావడం జరిగిందని, నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి కోసం పోరాడిన తెలంగాణ స్వతంత్ర సమరయోధులు కొమరం భీమ్, చాకలి ఐలమ్మ, షోయబుల్లాఖాన్, రావి నారాయణరెడ్డి, రామానంద తీర్థ, తదితర పోరాటయోధుల చరిత్రను పాఠ్యాంశాలలో చేర్పించి తెలంగాణ విమోచన దినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో రాష్ట్ర బాధ్యులు రమేష్ కుమార్ తపస్ మండల బాధ్యులు శంకర్, జిల్లా బాధ్యులు వెద్ ప్రకాష్, రాజు, శ్రీకాంత్ రెడ్డి, కిష్టయ్య, కృష్ణగౌడ్, నరసయ్య, తదితరులు పాల్గొన్నారు.